
రైతుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది
పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్య వార్తలను తీవ్రంగా ఖండించారు.ప్రజా ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకునే దిశగా కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.రైతులు మరియు మార్కెటింగ్ అధికారుల సమన్వయంతో మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రతి గింజ కొనుగోలు అయ్యే వరకు మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్క్ఫెడ్ అధికారులు, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సేవలు అందిస్తున్నారని చెప్పారు.మొక్కజొన్న గాని, వరి గాని రైతుల పంట మొత్తం కొనుగోలు చేసి వారికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రజా నాయకుడు కె.ఆర్ నాగరాజు సారథ్యంలో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు వంటి పథకాలు అందుతున్నాయని వివరించారు.రైతులను ఆర్థికంగా బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిల్లు నాయక్, రోల్లకల్ సర్పంచ్ దేవి మంగ్య నాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భాస్కర్ నాయక్, గోరుగుట్ట తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు వాగ్య నాయక్, అనిల్ నాయక్, వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.