మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని సెయింట్ అగస్టిన్ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు గౌరవమైన వృత్తికి తలవంపులు తీసుకొస్తున్నారు ఈ మధ్యలో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్న చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇలాంటి సంఘటన మరిపెడ పట్టణంలోని సెయింట్ అగస్ట్రా ప్రైవేట్ పాఠశాలలో పునరావృతమైంది. వివరాలలోకి వెళితే ఐదు నుంచి పదవ తరగతి చదివి విద్యార్థులను పట్ల పిఈటి రాంబాబు, మాథ్స్ టీచర్ రవి, హిందీ టీచర్ ఖదీర్, వాచ్మెన్ శ్రీను, డ్రైవర్ బిచ్చ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు విద్యార్థునులు వారి తల్లిదండ్రులతో చెప్పడంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది.వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్న చిన్న విద్యార్థునుల నుంచి పెద్ద విద్యార్థునుల వరకు ఆడపిల్లలని చూడకుండా వారి జేబులలో చేతులు పెడుతూ, ఎక్కడపడితే అక్కడ చేయి వేసి నిమురుతూ, ఒకవేళ వాష్ రూమ్ వస్తుంది అని అంటే నీకు నిజంగానే వస్తుందా ఒకసారి చూపెట్టు అంటూ చెప్పుకోలేని విధంగా దుష్ప్రవర్తన చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *