మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మ‌ల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అట్ట‌హాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నిర్మ‌ల్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు. నిర్మ‌ల్ లో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తన ప్రచార వాహనం లో తిరుగుతూ తమ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు త‌న నివాసంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
నిర్మ‌ల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణం ఎటు చూసిన గులాబీమ‌యంగా మారింది. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి అపూర్వ స్వాగ‌తం ప‌లికారు.
ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు

About The Author

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *