E69NEWS

ప్రజా గొంతుక

కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మాజీ గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి

27/07/2025 న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం స్వయంగా పరిశీలించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి,అనంతరం మొగుళ్ళపల్లి లక్ష్మి సాయి గార్డెన్స్ లో మండల స్థాయి ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు,కార్యకర్తల సమీకరణ,సమన్వయంపై విశ్లేషణ జరిపారు.పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ రాబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈ పర్యటనలో మండల బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *