ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
  • గిరిజన దర్బార్‌లో 63 దరఖాస్తుల స్వీకరణ
  • ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి జాప్యం లేకుండా పరిష్కరించాలి: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

తెలుగు గళం ఏటూరునాగారం, సెప్టెంబర్ 28:

ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ప్రజల నుంచి దరఖాస్తులను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 63 దరఖాస్తులు అందాయి. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతలు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని పీఓ ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తుల్లో ఉప సంచాలకుల శాఖకు 15, ఇందిర జల ప్రభకు 21, గిరిజన ఉపశమన నిధికి 1, గిరిజన సహకార సంస్థ గ్యాస్ కనెక్షన్‌కు 1, మత్స్యశాఖకు 1, విద్యుత్ లైన్లకు 1, నకిలీ ధ్రువపత్రంపై చర్యకు 1, గిరిజన సంక్షేమ శాఖ భవనాలు–కాంట్రాక్ట్ పనులకు 4, ములుగు ఆర్డీవోకు 1, ఇందిరమ్మ ఇళ్లకు 2, సమాచార హక్కు చట్టానికి 3, ఎస్‌డీసీకి 6, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీలకు 1, ఐటీడీఏకు 5 దరఖాస్తులు అందాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి గిరిజన దర్బార్ వేదికగా ఉపయోగించుకోవాలని, ప్రతి దరఖాస్తుపై బాధ్యతతో స్పందించి పరిష్కారం చూపాలని పీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ (జనరల్) టీవీఆర్ దామోదర స్వామి, ఉప సంచాలకులు డి. జనార్ధన్, ఈఈ (గిరిజన సంక్షేమం) ప్రవీణ్, ఎస్‌డీసీ ప్రతాప్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *