రక్తదాన శిబిరం,ర్యాలీ నిర్వహణ
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యువజన విభాగం (ఏవైడబ్ల్యూ) ఆధ్వర్యంలో అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు స్థానిక 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేశారు.అనంతరం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కన్వీనర్ హేమ సుందర్ జిల్లోజు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలు చిరస్మరణీయమనియువతలో దేశభక్తి,సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ఆయన జీవితం నిరంతర స్ఫూర్తి అని పేర్కొన్నారు.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ గౌడ్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాల సాధనతో పాటు సమాజంలో సమానత్వం,న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా నాయకులు పరిక్షన్,బాబులాల్ పవార్,నేరాటి ఆంజనేయులు,దర్శనం రమేష్,కొడంగల్ శ్రీనివాస్,రామకృష్ణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
