యజ్ఞనారాయణపురం పంచాయతీ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలయజ్ఞనారాయణపురం పంచాయతీ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాల

సత్తుపల్లి/కల్లూరు,సెప్టెంబర్28(తెలుగు గళం) న్యూస్:నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం చండ్రుపట్ల సెక్టార్ సూపర్ వైజర్ సుజాత పరిధిలోని యజ్ఞనారాయణపురం పంచాయతీ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని, పిల్లలను క్రమం తప్పకుండా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. గ్రామంలో బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు.ఉపసర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే ఆరోగ్యలక్ష్మి భోజనం ప్రతి పేద బిడ్డకు చేరేలా చూడాలని సూచించారు. లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా సామూహిక సీమంతాలు నిర్వహించి, రక్తహీనత నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులను ప్రీ-స్కూల్‌కు పంపించి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో: అంగన్వాడీ టీచర్స్ కరుణ,నిర్మల,జ్యోతి,ఆయాలు,ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *