తల్లితండ్రులు పిల్లల పెంపకము,పోషకాహారం పై శ్రద్ధ చూపాలి: ఇజ్జిగాని గంగాజలం(బీరాపల్లి సెక్టార్ సూపర్ వైజర్)
సత్తుపల్లి/వేంసూరు,సెప్టెంబర్28(తెలుగు గళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని
వేంసూరు మండలo చిన్నమల్లెల గ్రామంలో బీరాపల్లి ఐసీడీఎస్ సెక్టార్ సూపర్ వైజర్ ఇజ్జిగాని గంగాజలం ఆధ్వర్యంలో సోమవారం పోషణమాసం కార్యక్రమం జరిగింది. పిల్లలకు తల్లిపాల ఆవశ్యకత,ఐదేళ్ల వరకు పిల్లల పెంపకం,గర్భిణుల ఆహారంపై అవగాహన కల్పించారు.తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించి పోషకాహారం,ఇంటి ఆహారపు అలవాట్లు పెంపొందించాలని సూచించారు.8 మంది చిన్నారులకు గ్రామ సర్పంచ్ కుక్కపల్లి ధనలక్ష్మి కిరణ్ చేతులమీదుగా అక్షరాభ్యాసం చేశారు.పదార్థాల స్టాల్ పెట్టారు.ఈ కార్యక్రమంలో: అంగన్వాడీ టీచర్స్ అనంతలక్ష్మి, ముక్తేశ్వరీ, ఆయా చుక్కమ్మ,ఆశా వర్కర్ మంగమ్మ, గ్రామ పంచాయతీ వర్కర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
