ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన పోతు రాజశేఖర్ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన పోతు రాజశేఖర్
  • విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శిగా రాజశేఖర్ సేవలు అభినందనీయం
  • అంకితభావం, క్రమశిక్షణతో ఆదర్శ ఉపాధ్యాయుడిగా నిలిచారు
  • ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన పోతు రాజశేఖర్

తెలుగు గళం ఏటూరునాగారం సెప్టెంబర్ 29:

ఏటూరునాగారం మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉత్తర విభాగం ప్రధానోపాధ్యాయులు పోతు రాజశేఖర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సందర్భంగా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. గత 14 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉత్తమ విద్యా సేవలందిస్తూ, వారి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న పోతు రాజశేఖర్ సేవలు అభినందనీయమని ఉపాధ్యాయ నాయకులు కొనియాడారు. ఉపాధ్యాయుడిగా కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా, విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్నారని అన్నారు. మండల అధ్యక్షుడు అడప రాజేందర్, ప్రధాన కార్యదర్శి వాంకుడోత్ రాంబాబు మాట్లాడుతూ రాజశేఖర్ తన బాధ్యతలను ఉద్యోగంగా కాకుండా పవిత్రమైన బాధ్యతగా భావిస్తూ అంకితభావం, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ఆప్యాయతతో సేవలందిస్తున్నారని తెలిపారు. కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు నరిగే రమేష్ మాట్లాడుతూ మంచి ఉపాధ్యాయుడి గొప్పతనం ఆయన బోధించిన పాఠాల్లోనే కాకుండా, ఆయన బోధించిన విద్యార్థుల జీవితాల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు, సభ్యులు పోతు రాజశేఖర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.బి. నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు ఉట్నూరి రాంబాబు, జిల్లా కార్యదర్శి గజవెల్లి విష్ణుమూర్తి, మండల ఉపాధ్యక్షులు అంగోతు సుమన్, కార్యదర్శి గుమ్మల రవీందర్, కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు నరిగే రమేష్, వాజేడు మండల ఉపాధ్యక్షులు దాసుల నాగార్జున, ఉపాధ్యాయ సంఘం సభ్యులు రవీందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *