
కాంగ్రెస్ నుంచి ఐదుగురు బహిష్కరణ
వేలేరు, సెప్టెంబర్ 29 (ఈ69న్యూస్): వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్‌పై జరిగిన దాడి ఘటనపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదులు, నివేదికలను పరిశీలించిన అనంతరం ఐదుగురు నేతలు, కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రకటించారు.సెప్టెంబర్ 17న లక్ష్మణ్ నాయక్‌పై దాడి జరగగా ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ నాయక్ సెప్టెంబర్ 25న ఫిర్యాదు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలతో హనుమకొండ డీసీసీ తరఫున టీపీసీసీకి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ పరంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.బహిష్కరణకు గురైన వారిలో డీసీసీ కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ సద్దాం హుస్సేన్, మాజీ వార్డు మెంబర్ భైరి అనిల్, 14వ వార్డు మెంబర్ అందె కృపా సాగర్, పార్టీ కార్యకర్త కుర్సపెల్లి హరీష్, మాజీ సోషల్ మీడియా మండల ఇన్ఛార్జ్ మహమ్మద్ సలీం మాలిక్ ఉన్నారు.పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై స్థాయితో సంబంధం లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.