నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కుల వెంకటేష్ డిమాండ్నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కుల వెంకటేష్ డిమాండ్
  • ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి:
  • -నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కుల వెంకటేష్ డిమాండ్

తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 29:

గ్రామ కంఠం కింద తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైన విషయంపై అధికారులు తక్షణమే స్పందించి, స్థలాన్ని పరిరక్షించడంతో పాటు ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు చిక్కుల వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్ సంపత్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. కమ్యూనిటీ హాల్ కోసం గతంలో కేటాయించిన స్థలానికి సంబంధించిన పాత రికార్డులు, 1976 సంవత్సరంలో గ్రామపంచాయతీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ఆనవాళ్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. సంబంధిత ఆధారాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి, స్థలాన్ని కాపాడి సంఘానికి న్యాయం చేయాలని కోరారు. సంఘం వినతిపై కమిషనర్ సంపత్ రావు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యను పూర్తిస్థాయిలో పరిశీలించి న్యాయబద్ధమైన పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు జంపాల సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్న కుమార్, కార్యదర్శి ముత్యాల ప్రకాష్, మురారి రామకృష్ణ, వేల్పుగొండ శరభంధం, నరేందర్, వెంకటస్వామి, చిక్కుల స్వామి, సముద్రాల రమేష్, జంపాల శ్రీనివాస్, ముత్యాల రాజు, చిన్న సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *