* నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: పీఓ* నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: పీఓ
  • విద్యార్థుల విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: పీఓ

తెలుగు గళం ఏటూరునాగారం, సెప్టెంబర్ 29:

రామంజాపూర్‌లోని ఏహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన పీఓ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, విద్యా ప్రగతి, బోధనా విధానం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల రికార్డులు, విద్యా సంబంధిత వివరాలను పరిశీలించి పాఠశాల నిర్వహణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పీఓ తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు, అవసరమైన సౌకర్యాలపై సిబ్బందితో వివరాలు తెలుసుకున్న పీఓ.. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా అధికారులు, పాఠశాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పీఓ ఆకస్మిక తనిఖీ సందర్భంగా పాఠశాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *