జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఏవో వీరసింగ్జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఏవో వీరసింగ్

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర,
ఏవో వీరసింగ్

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

మరిపెడ మండలంలో విస్తృతంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్
మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్ విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్న రైతుల వివరాలను సేకరించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ చంద్ర మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పిస్తూ, పెండింగ్‌లో ఉన్న రైతులందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం ద్వారా ఎరువుల బుకింగ్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అలాగే ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు వ్యవసాయ సంబంధిత సేవలను పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరాసింగ్, వివిధ క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓ లు రైతులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *