స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 30 (ఈ69న్యూస్)

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, కులం పేరుతో దూషించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.ఫిర్యాదుదారుడు తోకల రాజు తెలిపిన వివరాల ప్రకారం..శివునిపల్లికి చెందిన ఎర్రం శ్రీనివాస్ స్థానిక “ఆంధ్రప్రభ” వాట్సాప్ గ్రూపులో ఓ వాయిస్ రికార్డింగ్‌ను పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ వాయిస్ రికార్డింగ్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, తల్లి, భార్యను ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం ఉపయోగించడంతో పాటు భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణలు చేశారని, కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రజాప్రతినిధి గౌరవానికి భంగం కలిగించేలా, సామాజిక వాతావరణంపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు చేసిన ఎర్రం శ్రీనివాస్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తోకల రాజు స్థానిక ఎస్‌హెచ్‌ఓను కోరారు.ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *