
హనుమకొండ, అక్టోబర్ 1 (ఈ69 న్యూస్):
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం టేకులగూడెం క్రాస్ వద్ద జాతీయ రహదారి 163పై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో వేలేరు ఎస్‌ఐ అజ్మీరా సురేశ్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడైన ఎస్‌ఐ సురేశ్‌ను హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలు, ఎస్‌ఐ సురేశ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.