అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ ఆవరణలో గల ప్రభుత్వ పెన్షనర్ల భవనంఅనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ ఆవరణలో గల ప్రభుత్వ పెన్షనర్ల భవనం
  • ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో మహనీయులకు ఘన నివాళులు
  • శాంతి, అహింసా మార్గంలో నడుచుకుందాం: పెన్షనర్ల సంఘం పిలుపు

గుత్తి, అక్టోబర్ 02:
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ ఆవరణలో గల ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, మరియు భారత రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలను బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ముందుగా అసోసియేషన్ కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, వెంకట సుబ్బమ్మలు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

  • మహత్మా గాంధీ మార్గం ఆచరణీయం: ఈ సందర్భంగా విజయ లక్ష్మి మాట్లాడుతూ.. బ్రిటిష్ ఇండియాలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన గాంధీజీ, ఇంగ్లాండ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించి, ఆ తర్వాత దేశ స్వాతంత్ర్యం కోసం శాంతి, అహింసా మార్గాల్లో పోరాడారని కొనియాడారు. మనమంతా ఆయన చూపిన బాటలోనే నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
  • స్ఫూర్తిదాయకం ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదం: కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు మాట్లాడుతూ.. దేశభక్తికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన లాల్ బహదూర్ శాస్త్రి దేశ రక్షణలో సైనికుల పాత్రను గుర్తిస్తూ ఇచ్చిన “జై జవాన్ – జై కిసాన్” నినాదం దేశ ప్రజలలో ఎప్పటికీ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుందని అన్నారు.
    ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం సెక్రటరీ రామ్ మోహన్, సభ్యులు వెంకట సుబ్బమ్మ, విజయ లక్ష్మి, గోవిందప్ప, స్వామి దాస్, నారాయణ రెడ్డి, డేనియల్, మద్దులేటి, వెంకటేష్, నరసింహులు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *