నీళ్ల చారు, పొడికారంతో బ్రేక్‌ఫాస్ట్.. ఇదేనా విద్యార్థుల పట్ల ప్రభుత్వ బాధ్యత?
హాస్టళ్లలో పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్ తో ఫోన్ లో మాట్లాడిన సత్యవతి రాథోడ్
తెలుగు గళం న్యూస్ చిన్నగూడూరు, మహబూబాబాద్ జిల్లా :
డోర్నకల్ నియోజకవర్గ చిన్నగూడూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి గిరిజన బాలుర వసతి గృహం, కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాలను పరిశీలించారు
ఈ సందర్భంగా గిరిజన బాలుర వసతి గృహంలోని వంటగది, విద్యార్థులకు అందుతున్న ఆహారం, వసతి సౌకర్యాలను పరిశీలించారు,హాస్టల్‌లో సరైన బెడ్స్ లేకపోవడం, బాత్రూంలు సరిగా లేకపోవడం, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు,విద్యార్థులకు అందుతున్న ఆహారంలో నాణ్యత లోపించకుండా ప్రభుత్వం తక్షణమే పౌష్టికాహారం అందించాలని అధికారులను కోరారు,అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన సత్యవతి రాథోడ్ అక్కడి పరిసరాలను పరిశీలించి బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు,ఈ సందర్భంగా బాలికలు నీళ్లతో చేసిన చారు, పొడితో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న దృశ్యాన్ని స్వయంగా చూసి,వారితో భోజనం చేసిన సత్యవతి రాథోడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన ప్రభుత్వం కనీస నాణ్యత లేని ఆహారం అందించే పరిస్థితి రావడం బాధాకరమన్నారు
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్ తో ఫోన్‌లో మాట్లాడిన సత్యవతి
హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్ తో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు,నూతన భవనం పూర్తయినప్పటికీ విద్యార్థులను అక్కడికి తరలించని పరిస్థితి ఉందని, వెంటనే నూతన భవనాన్ని ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
