ఏటూరునాగారం కేజీబీవీ విద్యార్థినులకు అభినందనలు!ఏటూరునాగారం కేజీబీవీ విద్యార్థినులకు అభినందనలు!
  • ఎస్‌జీఎఫ్‌ఐ, అథ్లెటిక్స్ పోటీల్లో పతకాల పంట..
  • సత్తా చాటిన గిరిజన బాలికలు!
  • చదువుతో పాటు క్రీడల్లోనూ అగ్రగామి..
  • ఏటూరునాగారం కేజీబీవీ విద్యార్థినులకు అభినందనలు!

తెలుగు గళం ఏటూరునాగారం, అక్టోబర్ 9:

ములుగు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) క్రీడా పోటీలతో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఏటూరునాగారం విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. క్రీడల్లో తమ ప్రతిభను చాటుతూ పాఠశాలకు మంచి పేరు తీసుకురావడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ స్కూల్ గేమ్స్‌లో జూనియర్ విభాగంలో వాలీబాల్‌లో ద్వితీయ స్థానం, కబడ్డీ, ఖోఖోలో ప్రథమ స్థానాలు సాధించగా, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. సబ్‌జూనియర్ విభాగంలో ఖోఖోలో ప్రథమ స్థానం, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానాలు సాధించి విద్యార్థినులు తమ క్రీడా ప్రతిభను నిరూపించుకున్నారు. అలాగే అక్టోబర్ 4న ములుగు జిల్లా బండారుపల్లిలో నిర్వహించిన జూనియర్, సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లోనూ కేజీబీవీ విద్యార్థినులు పలు పతకాలు సాధించారు. జావెలిన్ త్రో, షాట్‌పుట్, రన్నింగ్ తదితర విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు సాధించి విజయాన్ని అందుకున్నారు. విద్యార్థినులు క్రీడల్లో సాధించిన విజయాల పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ, పీఈటీ స్వరూప, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థినులను ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అరుణ, పీఈటీ స్వరూప, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *