నల్లబెల్లి గ్రామంలో తొమ్మిది రోజులపాటు జరిగిన బొడ్డెమ్మ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణం నల్లబెల్లి గ్రామంలో తొమ్మిది రోజులపాటు జరిగిన బొడ్డెమ్మ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణం

తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/అక్టోబర్ 09
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో తొమ్మిది రోజులపాటు జరిగిన బొడ్డెమ్మ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిసినాయి.గ్రామంలోని మహిళలు ప్రతిరోజు సాయంత్రం ఒకచోట చేరి బొడ్డెమ్మను పూలతో అందంగా పేర్చి,భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.బొడ్డెమ్మ చుట్టూ కోలాటం వేస్తూ,పాటలు పాడుతూ సంబరంగా జరుపుకున్నారు.చివరి రోజున సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మ నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ,బొడ్డెమ్మ పండుగ అనేది కేవలం పండుగ మాత్రమే కాదని,ఆడబిడ్డల ఐక్యతకు,మహిళల ఆత్మీయతకు ప్రతీక అని అన్నారు.తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ముందు జరుపుకునే ఈ బొడ్డెమ్మ వేడుకకు ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు.
రాబోయే తరానికి ఇప్పటినుండే హిందూ పండుగల గొప్పతనాన్ని, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తామని,పిల్లలకు కూడా పండుగల విశిష్టతను నేర్పిస్తామని మహిళలు పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *