250 జట్లలో మూడో స్థానం కైవసం!
విశాఖపట్నంలో ‘హ్యాక్విత్ వైజాగ్ 4.0’ పోటీల్లో కలాం జట్టుకు ఘన విజయం
ఈ69న్యూస్ అమలాపురం అక్టోబర్ 11

జాతీయ స్థాయి సాంకేతిక పోటీల్లో అమలాపురానికి చెందిన విద్యార్థి షేక్ ఇఫ్తిఖార్ అహ్మద్ తన ప్రతిభను చాటుకున్నాడు.విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ఐటీ కళాశాలలో నిర్వహించిన ‘హ్యాక్విత్ వైజాగ్ 4.0’ హ్యాకథాన్ పోటీల్లో తన బృందంతో కలిసి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 250 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఐదు దశలను విజయవంతంగా అధిగమించి మూడో స్థానం సాధించడం విశేషం.‘కలాం’ పేరుతో పోటీల్లో పాల్గొన్న ఈ బృందంలో షేక్ ఇఫ్తిఖార్ అహ్మద్‌తో పాటు డి.ఎస్.ఎస్.ఎస్. అమృత్, షేక్ అబ్దుల్ తౌఫికుల్లా సభ్యులుగా ఉన్నారు. వివిధ దశల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ పోటీని విజయవంతంగా పూర్తి చేసి మూడో స్థానాన్ని సాధించారు.250 జట్ల మధ్య జరిగిన పోటీలో ఈ ఘనత సాధించడం బృంద సభ్యుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.అమలాపురానికి చెందిన సాలార్ అహ్మద్, వజీరా సుల్తాన దంపతుల కుమారుడైన షేక్ ఇఫ్తిఖార్ అహ్మద్ బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఏడీ కోర్సు అభ్యసిస్తున్నాడు.చదువుతో పాటు సాంకేతిక రంగంపై ఆసక్తితో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతి సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తన కుమారుడు అల్లాహ్ కృపతో ఈ విజయాన్ని సాధించాడని తండ్రి సాలార్ అహ్మద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. షేక్ ఇఫ్తిఖార్ అహ్మద్‌తో పాటు బృంద సభ్యులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సాంకేతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పలువురు ఆకాంక్షించారు.అమలాపురం విద్యార్థి జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటడం స్థానికంగా ఆనందాన్ని కలిగించింది.