సర్పంచ్‌కు ఎమ్మార్పీఎస్ నాయకుల వినతి

ధర్మసాగర్ (ఈ69న్యూస్) అక్టోబర్ 11:
ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో బెల్ట్ షాపులను మూసివేసి, గంజాయి వినియోగాన్ని అరికట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ అడలి లక్ష్మి, నాగరాజును కలిసి వినతిపత్రం అందజేశారు.ఎమ్మార్పీఎస్ ధర్మసాగర్ మండల అధ్యక్షుడు సింగారపు పవన్ మాదిగ మాట్లాడుతూ, మద్యం, గంజాయి వల్ల కుటుంబాలు, యువత తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవడంతో పాటు, గంజాయి విక్రయాలు, వినియోగాన్ని అరికట్టాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సాయిపేట గ్రామశాఖ అధ్యక్షుడు సోంపల్లి ప్రవీణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు సింగారపు దిలీప్ మాదిగ, ప్రధాన కార్యదర్శి వక్కల రుసన్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.