• శంకరాజుపల్లి సమీపంలో మృతదేహం గుర్తింపు.. పోలీసులకు సమాచారం
  • దుర్వాసనతో వెలుగులోకి వచ్చిన ఘటన..
  • తుపాకులగూడెం రోడ్డుపక్కన మృతదేహం

తెలుగు గళం ఏటూరునాగారం, అక్టోబర్ 14

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి శివారులోని తుపాకులగూడెం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన తిరుగురాళ్ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొందరికి రహదారి పక్కన ఉన్న పొదల ప్రాంతం నుంచి దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏటూరునాగారం ఎస్‌ఐ బి. మహేష్‌కు విషయం తెలియజేయగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించే అవకాశం ఉంది. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మృతుడి ఆచూకీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *