సాయిపేట గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు
ధర్మసాగర్ (ఈ69న్యూస్) అక్టోబర్ 14

ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలోని శ్రీశ్రీశ్రీ దుర్గామాత అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అడాలి లక్ష్మీ నాగరాజు భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి మాలను ధరించి నియమనిష్ఠలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, సిరిసంపదలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం ద్వారా మనశ్శాంతి, ఆధ్యాత్మిక ధైర్యం లభిస్తాయని పేర్కొన్నారు.ఈ పూజా కార్యక్రమంలో సర్పంచ్తో పాటు రాచర్ల రంజిత్, సాయం శ్యాంబాబు, సాయం శ్రావణ్, కొలిపాక రవీందర్, పొట్టబత్తిని ధర్మేందర్, రాచర్ల రాజేందర్, చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు.