ధర్మసాగర్, అక్టోబర్ 14 E69NEWS

ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బత్తిని ఎల్ల గౌడ్ జన్మదిన వేడుకలను మంగళవారం ఆయన స్వగృహంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులు, బంధువులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మంచితనానికి మారుపేరుగా,అందరితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండే ఎల్ల గౌడ్ ప్రజల మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు.కులమతాలకు అతీతంగా సేవాభావంతో ప్రజలకు అండగా నిలుస్తూ, సమాజ శ్రేయస్సు కోసం మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రేయోభిలాషులు కోరుకున్నారు.