- మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గం, బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు మోక్షం లభించింది.
కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో, డివిజన్ వ్యాప్తంగా సుమారు రూ. 5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు త్వరలో చేపట్టనున్నట్లు బౌద్ధనగర్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి స్వరూప గౌడ్ తెలిపారు.
ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పనుల ప్రారంభోత్సవం గురించి చర్చించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ పేర్కొన్నారు.
చేపట్టనున్న అభివృద్ధి పనులు:
- అంబర్ నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్, అశోక్ నగర్, ఎల్. నారాయణ నగర్, వారసిగూడ తదితర బస్తీలలో సిమెంట్ రోడ్లు
- డ్రైనేజీ పైప్ లైన్ల మరమ్మత్తు
- కమ్యూనిటీ హాళ్లలో మరమ్మత్తులు
- పవర్ బోర్ల మరమ్మత్తు, కొత్త నీటి ట్యాంకుల ఏర్పాటు
- తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాల మార్పు, కొత్త కేబుల్ వైర్లు
గత కొన్ని నెలలుగా డివిజన్ లోని అన్ని బస్తీలలో బస్తీ కమిటీ అధ్యక్షులతో కలిసి పాదయాత్ర నిర్వహించి సమస్యలను గుర్తించి, వాటిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, అధికారుల ద్వారా నిధులు మంజూరు చేయించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ తెలిపారు.
“బౌద్ధనగర్ అభివృద్ధి బీజేపీ తోనే సాధ్యం. గతంలో నేను కార్పొరేటర్ గా ఉన్నప్పుడు నగరంలోనే అత్యధికంగా రూ. 25 కోట్లతో డివిజన్ ను అభివృద్ధి చేశాను. ఇప్పుడు మళ్లీ కేంద్ర మంత్రి సహకారంతో అభివృద్ధి కొనసాగుతుంది” అని స్వరూప గౌడ్ అన్నారు.
డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
