పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన స్వయంభూ శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి
ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో చండి అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకం,కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో చండిక అమ్మవారు