e69news Warangal October 17

వరంగల్: మామునూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణకు సంబంధించి బతుకమ్మ ఆటస్థలాన్ని 43వ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మాడుగుల రాజ్కుమార్ పరిశీలించారు. పండుగ సందర్భంగా మహిళలు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై పరిశీలన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా సత్తిరెడ్డి, డివిజన్ ఎస్సీ సెల్ చైర్మన్ కలకోట్ల (చిన్న) భాస్కర్, సీనియర్ నాయకులు సింగారపు అరుణ, సాంబారి రమేష్, మాజీ సర్పంచ్ ఎర్ర విజయ్ కుమార్, ఈద ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.