e69news Warangal October 17

వరంగల్: మామునూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణకు సంబంధించి బతుకమ్మ ఆటస్థలాన్ని 43వ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మాడుగుల రాజ్‌కుమార్ పరిశీలించారు. పండుగ సందర్భంగా మహిళలు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై పరిశీలన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా సత్తిరెడ్డి, డివిజన్ ఎస్సీ సెల్ చైర్మన్ కలకోట్ల (చిన్న) భాస్కర్, సీనియర్ నాయకులు సింగారపు అరుణ, సాంబారి రమేష్, మాజీ సర్పంచ్ ఎర్ర విజయ్ కుమార్, ఈద ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *