జాఫర్‌గఢ్ మండల కాంగ్రెస్ సమావేశంలో కూచన రవళి రెడ్డి, లింగాల జగదీశ్వర్ రెడ్డి పిలుపు
E69NEWS జాఫర్‌గఢ్, అక్టోబర్ 19

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, జనగామ జిల్లా పట్టభద్రుల ఎన్నికల ఇన్చార్జి కూచన రవళి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి లింగాల జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు పాల్గొని నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారాన్ని విస్తృతం చేయాలని, పట్టభద్రుల ఓటర్లను నేరుగా కలిసి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని కోరారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని సంప్రదించి పార్టీ విధానాలను, ప్రభుత్వ లక్ష్యాలను వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా ప్రచార కార్యక్రమాలను రూపొందించుకొని ఓటర్లతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జాఫర్‌గఢ్ మండల పీఏసీఎస్ చైర్మన్ తీగల కర్ణాకర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెబోయిన బిక్షపతి, మండల ఎన్నికల ఎన్రోల్మెంట్ ఇన్చార్జి బానోత్ రాజేష్ నాయక్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోనాసి క్రాంతి కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇల్లందల విజయ్, నియోజకవర్గ సామాజిక మాధ్యమాల ఇన్చార్జి నీలం యువరాజ్, మాజీ ఎంపీపీ రాడపాక సుదర్శన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జారి రాజు, మాజీ జడ్పీటీసీ ఇల్లందల శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ బొమ్మినేని పెద్దిరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికాయల రాజేందర్, జాఫర్‌గఢ్ 1, 2 గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల సారంగం, మంచాల అనిల్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.