హాజరైన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్*హాజరైన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్*

పర్వతగిరిలో ‘సంఘ మిత్ర’ కార్యక్రమం-హాజరైన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్*

తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/అక్టోబర్ 28

వరంగల్ జిల్లా:పర్వతగిరి: మత్తు పదార్థాల నివారణకు మహిళలు యుద్ధం ప్రకటించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత,ఐపీఎస్ ఆదేశాల మేరకు పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు వేదిక వద్ద‘డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా’సంఘ మిత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ..డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను వివరించారు. యువత సరదాగా మొదలుపెట్టి మత్తుకు బానిసలై జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ఉదాహరణలతో తెలిపారు.సంఘ మిత్ర అంటే సమాజానికి మిత్రులు,మహిళలు సమాజానికి నిజమైన మిత్రులు. ప్రతి మహిళ కుటుంబంలో తల్లిగా, కుమార్తెగా, సోదరిగా వివిధ పాత్రలు పోషిస్తుంది. ఇంట్లో ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడితే మహిళలు త్వరగా గుర్తించగలరు. అందుకే డ్రగ్స్ నిర్మూలనలో మహిళలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.పోలీసుల సూచనలు:
తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లు,స్నేహితుల వివరాలు, రోజువారీ ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.గ్రామాలు,పట్టణాల్లో గంజాయి సరఫరా లేదా విక్రయాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలి.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతారు.
గంజాయి సేవిస్తున్నట్లు తెలిస్తే 112 కు సమాచారం ఇవ్వాలి.ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ వెంకటేశ్వర్లు,పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్,ఎస్ఐ రాజ్ కుమార్,పోలీసు సిబ్బంది,గ్రామీణ మహిళలు,మహిళా సంఘాల సభ్యులు,అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సుమారు 200 మంది పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *