- దాతల సహకారంతో రూ.14 వేల ఆర్థిక సాయం అందజేత!
- ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన జ్వాలా ట్రస్ట్ సభ్యులు!
తెలుగు గళం మంగపేట, అక్టోబర్ 28:
మానవత్వమే మిన్న.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే లక్ష్యంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తమ సేవా నిరతిని చాటుకుంది. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని మాలవాడకు చెందిన జెట్టి సుమిత్ర అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబ సభ్యులు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్‌ను సహాయం కోరారు. దీంతో ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా దాతలకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన పలువురు దాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించడంతో మొత్తం రూ.14,000 సేకరించారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేసి, ఆపద సమయంలో అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గోలి నరేష్, గంగుల చంటి, నిమ్మల నరేష్, మావిల్ల నాగరాజు, కర్రి లక్ష్మయ్య, తోగరి సురేష్, తోగరి ఆనంద్, తోగరి అరుణ్, సాధనపల్లి సాంబయ్య, జెట్టి రవి, గద్దల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
