రూ.33,500 చెక్కు అందజేత!రూ.33,500 చెక్కు అందజేత!

రూ.33,500 చెక్కు అందజేత!

  • మంత్రి సీతక్క ఆదేశాలతో బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా..
  • చెక్కు అందించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు!
  • ప్రజా సంక్షేమమే లక్ష్యం.. నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ నాయకులు!

తెలుగు గళం కన్నాయిగూడెం, అక్టోబర్ 28:

ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు అన్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామ పంచాయతీకి చెందిన మఠం బన్నీ, తండ్రి వెంకటేశ్వర్లు గారికి రూ.33,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా జాడి రాంబాబు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయ నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి సీతక్క నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు మండలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని నాయకులు తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంతనపల్లి సర్పంచ్ చింత చంద్రయ్య, సర్వాయి సర్పంచ్ కోరం నర్సయ్య (రాజు), గుర్రేవుల సర్పంచ్ అంబాల సౌజన్య, చింతగూడెం సర్పంచ్ అల్లే అనిత, ముప్పనపల్లి సర్పంచ్ తిప్పనపల్లి లక్ష్మయ్య, ఐలాపూర్ సర్పంచ్ పీర్ల సురేష్, రాజన్నపేట సర్పంచ్ పొడెం నర్సింగరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మాదాసు రాజేందర్, మాజీ ఎంపీటీసీ ఆలం రాంబాబు, మండల నాయకులు పూజరి సత్యనారాయణ, మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు కుమ్మరి వెంకట్, బుట్టాయిగూడెం యువజన అధ్యక్షుడు జనగాం వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *