తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం ఎక్స్‌రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా నల్లబెల్లం పట్టుబడింది.అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం అనుమానాస్పదంగా కనిపించిన బొలెరో వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వాహనదారులు ఆగకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు దీంతో మరిపెడ పోలీసులు వాహనాన్ని వెంబడించి అడ్డుకుని తనిఖీ చేశారు,వాహనంలో 30 బస్తాల నల్లబెల్లం 2 బస్తాల పట్టిక ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు వాహనంలో ఉన్న ఇద్దరిని విచారించగా వారు చొక్ల తండాకు చెందిన బానోత్ కిషన్, బానోత్ నవీన్‌గా గుర్తించారు.కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి తక్కువ ధరకు నల్లబెల్లం పట్టిక కొనుగోలు చేసి చుట్టుపక్కల తండాల్లో విక్రయిస్తున్నట్లు వారు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.పట్టుబడిన నల్లబెల్లం విలువ సుమారు 1.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు,ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు
