ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

తెలుగు గళం న్యూస్ హన్మకొండ/అక్టోబర్ 29
హనుమకొండ:వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు – మల్లేశ్వరి దంపతులు తన మిత్రుడి కుటుంబంతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.తన స్నేహితుడు కీ.శే.కాలేశ్వరం ప్రకాశం-సుజాత దంపతుల ప్రథమ పుత్రుడు సూర్యదేవ్ వివాహం హిమాన్షితో హనుమకొండలోని కోడెం కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు.కేవలం అతిథిగా కాకుండా మిత్రుడి కుటుంబానికి అండగా నిలుస్తూ పెళ్లి పెద్దగా వ్యవహరించి, వివాహాన్ని స్వయంగా ముందుండి నిర్వహించారు.పెళ్లి పీటలపై కూర్చొని సంప్రదాయబద్ధంగా వధూవరుల వివాహ వేడుకను జరిపించారు.తన మిత్రుడి కుమారుడి వివాహాన్ని తన ఇంటి శుభకార్యంగా భావించి అన్ని బాధ్యతలు తానే తీసుకొని దగ్గరుండి జరిపించడం బంధుమిత్రులను ఆకట్టుకుంది. వధూవరులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు.మిత్రుడి సంతోషాన్ని తన సంతోషంగా భావించి కుటుంబ సభ్యుడిగా పెళ్లి పెద్ద బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆత్మీయత ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *