నియోజకవర్గ అభివృద్ధిని చూసి మాట్లాడండి.. కొలిపాక సతీష్ ఘాటు హెచ్చరిక
తెలుగు గళం ఈ69న్యూస్ స్టేషన్ ఘన్‌పూర్ అక్టోబర్ 29

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సోషల్ మీడియాలో కొందరు నాయకులు చేస్తున్న విమర్శలు సిగ్గుచేటని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలిపాక సతీష్ మండిపడ్డారు.కడియం శ్రీహరి నియోజకవర్గంలో కనిపించడం లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో దాదాపు రూ.1,600 కోట్లతో నియోజకవర్గంలో వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు తదితర రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు నియోజకవర్గ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.రైతులకు సాగునీరు అందించేందుకు కాలువల ద్వారా నీటి సరఫరా, వ్యవసాయ రంగ అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తున్నారని వివరించారు.దాదాపు 74 ఏళ్ల వయసులోనూ కడియం శ్రీహరి ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని కొలిపాక సతీష్ అన్నారు.వ్యక్తిగత పనిమీద నెల రోజుల పాటు తన కుమార్తె వద్దకు వెళ్లిన సందర్భాన్ని ఆసరాగా చేసుకుని ఆయనపై అనవసర విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలితాలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సమంజసం కాదు.ఇలాంటి చిల్లర ప్రచారాన్ని మానుకోవాలి.లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు** అని కొలిపాక సతీష్ హెచ్చరించారు.