మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి! మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి!

  • సమయస్ఫూర్తితో వ్యవహరించిన 108 సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం!
  • అత్యవసర సమయంలో అండగా నిలిచిన 108 సిబ్బంది.. కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు!

తెలుగు గళం మంగపేట, (అక్టోబర్ 29):

ములుగు జిల్లా మంగపేట మండలం దోమెడ గ్రామానికి చెందిన కోరం నాగలక్ష్మికి గురువారం తెల్లవారుజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు (ఈఎంటీ) ఎడ్ల నరేష్ అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేయించారు. నాగలక్ష్మి మగబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. సకాలంలో స్పందించి సేవలందించిన ఈఎంటీ ఎడ్ల నరేష్, పైలట్ మధుకుమార్‌లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *