ములకలపల్లి మండలంలోని సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు ములకలపల్లి మండలంలోని సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు

తెలుగు గళం ములకలపల్లి, అక్టోబర్ 29:

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలు, పంచాయతీ నిధుల విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ ములకలపల్లి మండలంలోని సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. రైతు వేదికలో పంచాయతీ నోడల్ ఆఫీసర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపై ఆగ్రహం
    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను సర్పంచులకు ఇవ్వకుండా కాంగ్రెస్ గ్రామ కమిటీలు, ఇందిరమ్మ కమిటీలు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చారని సర్పంచులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా ఎంపీడీవో జాబితాలు ఇచ్చినట్లు అంగీకరించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు.
  • 50 రోజులుగా నిధులు నిలిపివేతపై నిరసన
    పంచాయతీ నిధులు జమై 50 రోజులు గడిచినా, వర్క్ ఐడీలు లేవనే కారణంతో నిధులు నిలిపివేస్తున్నారని సర్పంచులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పంచాయతీలకు మాత్రం నిధులు డ్రా చేసుకునేందుకు అనుమతిస్తున్నారని విమర్శించారు. కంప్యూటర్ ఆపరేటర్ కొరత పేరుతో నాలుగు నెలలుగా వర్క్ ఐడీలు, బిల్లుల ప్రక్రియలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు.
  • ధర్నాకు సర్పంచుల హెచ్చరిక
    అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే పంచాయతీ అభివృద్ధి పనులను నిలిపివేసి, ప్రజలతో కలిసి మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని సర్పంచులు హెచ్చరించారు. గ్రామ ప్రథమ పౌరులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీనివాస్, గుట్టగూడెం సర్పంచ్ బానోత్ ధర్మ, ముత్యాలంపాడు సర్పంచ్ కల్లూరు కిషోర్, పొగళ్లపల్లి సర్పంచ్ మడకం రవి, పాత గంగారం సర్పంచ్ సోడే చైతన్య, గుట్టగూడెం సర్పంచ్ వాడే రాము, ములకలపల్లి సర్పంచ్ కోర్సా చంద్రలేఖ, తాళ్లపాయి సర్పంచ్ గడ్డం సుజాత, మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి, చవిటిగూడెం సర్పంచ్ తానం పద్మ, కమలాపురం సర్పంచ్ వర్గాల రాధ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *