కూటమి పార్టీల శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో కదంకూటమి పార్టీల శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో కదం

తెలుగుగళం న్యూస్, అనంతపురం.

అనంతపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార చివరి రోజున నగరంలో కూటమి పార్టీల శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో కదం తొక్కాయి. ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా నగరంలోని చారిత్రాత్మక టవర్ క్లాక్ సర్కిల్ నుండి గాంధీ బజార్ వరకు ఈ భారీ బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకుల నినాదాలతో అనంతపురం వీధులు మార్మోగాయి.ఈ సుడిగాలి ప్రచార బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి తోఖన్ సాహు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరందరితో కలిసి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కమ్మూరు నాగరాజు ఈ ర్యాలీలో చురుగ్గా పాల్గొని కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కమ్మూరు నాగరాజు మాట్లాడుతూ అనంతపురం నగర సమగ్ర అభివృద్ధి కూటమి పార్టీలతోనే సాధ్యమని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నగర రూపురేఖలు మారుస్తామని నేతలు హామీ ఇచ్చారు. ర్యాలీ పొడవునా ప్రజలు వ్యాపారులు కూటమి నాయకులకు ఘనస్వాగతం పలికారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *