జీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొరజీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర
  • గ్రామపంచాయతీ అభివృద్ధి అడ్డుకుంటున్న రాజకీయ నాయకులు..
  • .జీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర

తెలుగు గళం న్యూస్ ములుగు వెంకటాపురం. (నూగూరు)అక్టోబర్ 30

ఏజెన్సీ ప్రాంతంలో గ్రామపంచాయతీల నిధుల పై రాజకీయ నాయకుల పెత్తనం ఏమిటని,ఆదివాసి గ్రామాల అభివృద్ధికి అడ్డుపడితే సహించబోమని పూనెం సాయి మండిపడ్డారు.శుక్రవారం వెంకటాపురం మండలం కమ్మరిగూడెం గ్రామంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర హాజరై మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో గ్రామపంచాయతీలో రాజకీయ పార్టీ నాయకుల పెత్తనం ఏమిటని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రతిక్షణం రాజకీయ పార్టీల నాయకులు అడుగడుగున అడ్డుపడుతున్నారని అన్నారు.అమాయకమైన ఆదివాసీలను రాజకీయ పార్టీల తరఫు నుండి సర్పంచులు గా గెలిపించి.ఎవరైతే పార్టీ అభ్యర్థులు ఉంటారో,వాళ్లు గెలుపొందే వరకే వారి బాధ్యత ఉంటుందని తర్వాత వారి విధులని గ్రామపంచాయతీ అభివృద్ధికి మాత్రమే నిర్వహించాలి తప్ప రాజకీయ పార్టీ నాయకుల మాటలు వినోదని ఆయన అన్నారు.ఏజెన్సీ గ్రామపంచాయతీలోకి రాజకీయ పార్టీ నాయకులను రాకుండా అడ్డుకున్నప్పుడే ఆదివాసి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన,మన చట్టాలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయని ఆయన అన్నారు.ఆదివాసి గ్రామపంచాయతీలోకి రాజకీయ పార్టీలను రాకుండా బహిష్కరించాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. ఏజెన్సీ గ్రామపంచాయతీ అభివృద్ధికి రాజకీయ పార్టీలు నాయకులు అడ్డుపడితే సహించబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వలన ఆదివాసి చట్టాలు రాలేదని ఎంతోమంది ఆదివాసి అమరవీరుల ప్రాణ త్యాగాలు చేస్తే ఆదివాసి చట్టాలు వచ్చాయని గుర్తుచేశారు.అలాగే ఆదివాసి ప్రజా ప్రతినిధులు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని,ఈనాడు ఏజెన్సీ చట్టాలు ఉన్నందునే ఆదివాసి రిజర్వేషన్ పై గెలుపొంది అధికారంలో ఉన్నారని,అదే ఆ చట్టాలు నిర్వీర్యం జరిగితే రేపు ఈ రిజర్వేషన్ కూడా ఉండదని,ఇది ప్రతి ఒక్క ఆదివాసి ప్రజా ప్రతినిధిలు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఏజెన్సీ చట్టాలు నేడు రద్దు చేయాలని రాజకీయ పార్టీలే కంకణం కట్టుకున్నాయనీ ఈ సందర్భంగా తెలిపారు.అలాగే ఆదివాసి అభివృద్ధి జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పూనెం విజయ్,ప్రసాద్,కృష్ణార్జునరావు,దినేష్.తదితరులు పాల్గొన్నారు..

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *