ఎండి అబ్బాస్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుఎండి అబ్బాస్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
  • జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకోవాలి

  • జనగామ ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఎం ధర్నా
  • ఎండి అబ్బాస్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
    *====================
    జనగామ పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మించుకున్న ఇండ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన 72 మంది కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని, సంబంధిత వీరనారి ఐలమ్మ నగర్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు శుక్రవారం మహాధర్నాకు సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనగామ జిల్లా ఇన్చార్జి . పోగులేటి శ్రీనివాస్ రెడ్డి . మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు అన్యాయం చేస్తే సిపిఎం ఊరుకోదు మంత్రి కలగజేసుకొని పేదలకు ఇంటి నెంబర్లు వేసి ఆదుకోవాలి ఎందుకంటే అప్పుడు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి నెంబర్ వేయాలి అని అన్నారు 2012–2013 సంవత్సరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసిందని, వాటి ఆధారంగా లబ్ధిదారులు తమ సొంత ఖర్చులతో ఇళ్లను నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ పట్టాలను తిరిగి తీసుకొని కొత్తవారికి కేటాయిస్తామని చెప్పడం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను లబ్ధిదారుల నుంచి తిరిగి తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం లబ్ధిదారు దగ్గర పట్టా పేపర్ జిరాక్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు కుటుంబ సభ్యుల వివరాలు తీసుకున్నారు కాబట్టి ఇచ్చిన పట్టాలకు గౌరవం ఇచ్చి, లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.అదేవిధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం సందర్భంగా 72 మంది పేదలు తమ ఇళ్లను కోల్పోయారని, వారికి వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించి, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.పేదలు ఎన్నో కష్టాలు పడి నిర్మించుకున్న ఇళ్లకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, వారి నివాస హక్కులకు భంగం కలిగించకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పేదల పక్షాన సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణమ లింగం పగిడిపల్లి బాలమణి నాయకులు రమావత్ నిత్య నాయక్ దామెర అబ్రహం లింకన్ ఎండి గౌసియా కచ గల వెంకటేష్ మాదాసు సుధాకర్ మునిసిపట్ల జయరాల ఉపేందర్ రాజు కొల్లిపాక నరసింహులు వెలిశెట్టి కృష్ణ తిమోతి సౌందర్య అండాలు పద్మ ఎండి . అమ్ములు గంపల సతీష్ రమేష్ పద్మ అంజమ్మ బండ రమాదేవి మట్ట కవిత కొలిపాక వెంకటలక్ష్మి నాజియా తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *