సుంకరి భిక్షం గౌడ్
పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ తమ బాధ్యతగా పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పిఆర్టీయూ రాష్ట్ర సంఘ అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భట్టాపురం మధుసూధన్ రెడ్డి అన్నారు. నర్సంపేటలో ఓ పదవి విరమణ కార్యక్రమానికి వెళుతున్న వారిని మరిపెడ మండల కేంద్రములో పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్ నేతృత్వంలో వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మరిపెడ మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని,ప్రతి ఉపాధ్యాయుడు పట్టభద్రుల ఓటు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు కోరారు. అర్హులైన ఉపాధ్యాయులందరూ నిర్ణీత గడువులోగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు నరసింహ, మధుబాబు,రాంపెల్లి శ్రవణ్ కుమార్ గౌడ్,వెంకన్న, విశ్వనాథం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
