అభినందించిన తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్అభినందించిన తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్

అభినందించిన తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్…

శేరిలింగంపల్లి, నవంబర్ 01 ( తెలుగు గళం ) న్యూస్

జూనియర్ హాకీ జాతీయ క్యాంప్ కి ఏంపికైన నల్గొండ జిల్లాకు చెందిన రావుల గణేశ్ ని తెలంగాణ హాకీ ఆద్యక్షుడు కొండ విజయ్ ఆభినందించారు. చందానగర్ హుడా కాలనీ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండ విజయ్ మాట్లాడుతూ జాతీయ హాకీ లో తెలంగాణ హాకీ క్రీడాకారుడు ఏంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణతో రాణిస్తే ఏ రంగంలోనైనా విజయం వైపు అడుగులు వేయెచ్చని , దీనికి ఉదాహరణ రావుల గణేశ్ అని పేర్కోన్నారు. తెలంగాణ లో హాకీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నట్లు, ప్రభుత్వ సహాయంతో ప్రముఖ పట్టాణాలలో టర్ఫ్ గ్రౌండ్ లు ఏర్పాటు.చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కోన్నారు. రావుల గణేష్ కి మంచి భవిష్యత్తు ఉన్నదని, హాకీ లో రాణించే ప్రతి క్రీడాకారునికి తమ ప్రోత్సాహం ఉంటుందని కొండ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ప్రోత్సాహకంగా నగదుతో పాటు హాకీ స్టిక్ ట్రావెల్ బ్యాగ్ తో గణేశ్ ని కొండ విజయ్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో హాకీ నల్గొండ సెక్రటరీ కరీమ్, రంగారెడ్డి సెక్రటరీ భాస్కర్ రెడ్డి, శిక్షకుడు యావర్, సీనియర్ ప్లేయర్స్ ఫరూఖ్, అజీజ్, తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *