పలు ట్రేడ్ యూనియన్లకు నూతన సారధులను ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
తెలంగాణ రక్షణ సేన పార్టీ ట్రేడ్ యూనియన్,అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం.
అంగన్వాడీ & హెల్పర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ధరంసొత్ శివమ్మ నియామకం. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన శివమ్మ ను, అంగన్వాడి సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న శివమ్మ ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షురాలు గా నియమించారు,ఈ సందర్భంగా శివమ్మ కు నియామక పత్రం అందజేశారు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర అధ్యక్షులు కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాల కల్పన కోసం యూనియన్ తరఫున నిరంతరం పోరాటం చేయాలని పార్టీ చీఫ్ కవిత కోరారు.నూతనంగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు శివమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో నన్ను తెలంగాణ రక్షణ సేన, అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితక్క కు, గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి అక్క కు,యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.
