చంద్రుపట్ల సెక్టార్ పరిధిలోని ముచ్చవరం అంగన్వాడీ కేంద్రంచంద్రుపట్ల సెక్టార్ పరిధిలోని ముచ్చవరం అంగన్వాడీ కేంద్రం

సత్తుపల్లి/కల్లూరు,నవంబర్20(తెలుగు గళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం
చంద్రుపట్ల సెక్టార్ పరిధిలోని ముచ్చవరం అంగన్వాడీ కేంద్రంలో బాలల హక్కుల వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టార్ పర్యవేక్షకురాలు సుజాత మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రాముఖ్యత, బాలల ప్రాథమిక హక్కులు, బాలల సంరక్షణపై వివరించారు. పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మంచి స్పర్శ, చెడు స్పర్శపై పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు బాలల చట్టాల గురించి వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో: పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ చాంద్ సాహెబ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు జ్యోతి, వరలక్ష్మి, సులోచన, శైలజ, విద్యార్థులు, బాలల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *