ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు.. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలి

జఫర్‌గఢ్, నవంబర్ 21 (ఈ69న్యూస్ -తెలుగు గళం దినపత్రిక)

పోలీస్ శాఖ పనితీరును మరింత మెరుగుపరిచి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ శనివారం జఫర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ చేపట్టారు.స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీస్ అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.అనంతరం స్టేషన్ ఆవరణలో ఆమె ఉసిరి మొక్కను నాటారు. ఆ తర్వాత స్టేషన్‌లోని వివిధ రికార్డులు, రిజిస్టర్లు, కేసుల పురోగతిని పరిశీలించి పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణపై సమీక్షించారు.ఈ సందర్భంగా సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ..ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే స్పందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గంజాయి వినియోగం, అక్రమ విక్రయాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలని, రోజూ వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు.ఈ తనిఖీ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, వర్ధన్నపేట సీఐ వై. సంజీవరావు, జఫర్‌గఢ్ ఎస్‌ఐ బొల్లం వినయ్ కుమార్, వర్ధన్నపేట ఎస్‌ఐ బోగం ప్రవీణ్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *