ఈ69 న్యూస్,పెద్దవడుగూరు.
రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీలకు పెద్దవడుగూరులోని ఆదర్శ విద్యా నికేతన్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. తైక్వాండో కోచ్ తలారి తులసీరామ్ వద్ద శిక్షణ పొందిన ఈ విద్యార్థులు రాబోయే పోటీలలో తమ ప్రతిభను చాటనున్నారు.
ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్ కరణం నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్ కరణం మాధురి లహరి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోచ్ తలారి తులసీరామ్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
