ఈ69 న్యూస్,అనంతపురం.
అనంతపురం జిల్లా తైక్వాండో అసోసియేషన్ మరియు బెస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23న రాయలసీమ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కె. శాంతరాజ్, సెక్రటరీ తులసి రామ్ ఒక ప్రకటనలో తెలిపారు.పెనకచెర్ల డ్యామ్‌లోని నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి.ఈ ఛాంపియన్‌షిప్‌లో రాయలసీమలోని అన్ని జిల్లాల నుండి వందలాది మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. పోటీలు ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని వారు వెల్లడించారు.
