రాయలసీమ తైక్వాండో పోటీలకు ఆదర్శ విద్యా నికేతన్ విద్యార్థుల ఎంపికరాయలసీమ తైక్వాండో పోటీలకు ఆదర్శ విద్యా నికేతన్ విద్యార్థుల ఎంపిక

ఈ69 న్యూస్,పెద్దవడుగూరు.

రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీలకు పెద్దవడుగూరులోని ఆదర్శ విద్యా నికేతన్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. తైక్వాండో కోచ్ తలారి తులసీరామ్ వద్ద శిక్షణ పొందిన ఈ విద్యార్థులు రాబోయే పోటీలలో తమ ప్రతిభను చాటనున్నారు.
ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్ కరణం నారాయణరావు, వైస్ ప్రిన్సిపాల్ కరణం మాధురి లహరి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోచ్ తలారి తులసీరామ్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *