మైదానాలు లేని బడులెన్నో.. ఆటలకు దూరమవుతున్న బాల్యమెన్నో!మైదానాలు లేని బడులెన్నో.. ఆటలకు దూరమవుతున్న బాల్యమెన్నో!
  • క్రీడలే పిల్లల భవిష్యత్తుకు పునాది.. ఆడపిల్లల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ రక్షణ కవచం!
  • నాలుగు గోడలకే పరిమితమవుతున్న బాల్యం.. ఫోన్లకు బానిసలవుతున్న విద్యార్థులు!
  • ప్రతి పాఠశాలలో క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి చేయాలి!
  • ఒకప్పుడు పాఠశాల అంటే చదువుతో పాటు ఆటపాటలు, పరుగులు, క్రీడలతో సందడిగా ఉండేది. నేడు ఆటస్థలాలు లేక, క్రీడలకు సమయం కేటాయించక పిల్లల బాల్యం నాలుగు గోడలకే పరిమితమవుతోంది. సెల్‌ఫోన్లు, అంతర్జాలానికి అలవాటుపడుతున్న విద్యార్థులు శారీరక, మానసిక దృఢత్వాన్ని కోల్పోతున్నారు. పిల్లల సంపూర్ణ వికాసానికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. ఈ పరిస్థితిని గుర్తించిన పోలీస్ అధికారి దూపాటి సతీష్ తన కుమారుడు దూపాటి అన్వేష్‌కు మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి కల్పించడమే కాకుండా, నాలుగు పదుల వయసులో తానూ సాధన ప్రారంభించి కుమారుడితో కలిసి బ్లాక్ బెల్ట్ సాధించడం అభినందనీయం. విధి నిర్వహణ బాధ్యతల మధ్య కూడా పట్టుదలతో సాధన చేసి తండ్రీకొడుకులు సాధించిన ఈ విజయం నేటి తల్లిదండ్రులకు గొప్ప స్ఫూర్తి. ముఖ్యంగా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఎంతో అవసరం. మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల నేపథ్యంలో ఆత్మరక్షణ విద్య ప్రతి బాలికకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. అనుకోని ఆపద ఎదురైనప్పుడు భయపడకుండా పరిస్థితులను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుంది. అరుణిమా సిన్హా వంటి పట్టుదల కలిగిన మహిళలు, ఎనభై ఏళ్ల వయసులోనూ కలరిపయట్టు విద్యను బోధిస్తున్న పద్మశ్రీ మీనాక్షి అమ్మ వంటి స్ఫూర్తిమంతులు మనకు ఆదర్శం. వయసుతో సంబంధం లేకుండా సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని వారి జీవితాలు నిరూపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పాఠశాలలో కనీస ఆటస్థలాలు, క్రీడా ఉపాధ్యాయులు, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. ముఖ్యంగా బాలికలకు ఆత్మరక్షణ విద్యను అందించాలి. మైదానాలు పిల్లలకు ఆటస్థలాలు మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాదులు. ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో, ప్రతి బాలుడు దృఢసంకల్పంతో ఎదిగినప్పుడే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *