మానవ హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలిమానవ హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలి

వరకట్న నిర్మూలన,మహిళా సమానత్వం,ఆడబిడ్డల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా పురస్కారం అందుకున్న కుమ్మజెల్ల రాంబాబు తనపై కొంతమంది కింది స్థాయి నాయకులు,క్షేత్రస్థాయి ఉద్యోగులు వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు సమాన హక్కులతో పాటు ఆస్తిలో సమాన వాటా కల్పించినప్పుడే సమాజంలో వరకట్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ ఆలోచనకు అనుగుణంగా తన అక్కాచెల్లెళ్లకు ఆస్తిలో హక్కులు కల్పించగా, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వ్యవసాయ భూమిపై లేని వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు.
దాదాపు 40 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండటంతో పాటు,రైతుబంధు,రైతు భరోసా పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని,బ్యాంకు రుణాలు తీసుకుని తన అక్కాచెల్లెళ్లు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు.అయినప్పటికీ, గ్రామాన్ని విడిచివెళ్లిన వ్యక్తి ద్వారా ప్రజావాణి,పోలీస్ స్టేషన్లలో పదేపదే ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆరోపించారు.
భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో కొందరు వ్యక్తులు వివాదాలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రయత్నించడం బాధాకరమన్నారు. ప్రజావాణి వంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలను దుర్వినియోగం చేసే వారిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సామాజిక సేవ చేస్తున్న వారిని వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేస్తే భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇతరులు కూడా వెనుకడుగు వేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.మానవ హక్కులకు భంగం కలిగించే చర్యలను అరికట్టి, న్యాయం జరిగేలా ప్రభుత్వం,జిల్లా అధికారులు చొరవ తీసుకోవాలని సామాజిక కార్యకర్త కుమ్మజెల్ల రాంబాబు విజ్ఞప్తి చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *